అనంత శ్రీరామ్‌ రాసిన 'జనసేన జెండా' పాట విడుదల!

  • అనూప్‌ రూబెన్స్‌ సంగీతం
  • యూట్యూబ్‌లో విడుదల
  • గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా అంటూ సాగుతోన్న పాట
జనసేన జెండా పాట పేరిట ఆ పార్టీ ఈ రోజు మరో పాటను యూట్యూబ్‌లో విడుదల చేసింది. ఈ పాటను సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్‌ రాయగా, అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు. 'గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా.. తెల్లా తెల్లని జెండా, ఇది తెలుగోడి జెండా.. ఎర్రటి గుండెల జెండా' అంటూ 'జెండా పట్టు జెండా పట్టు జన సైనికుడా ఎత్తిన జెండా దించమాకు ఎప్పుడూ ఎక్కడా' అంటూ సాగుతోన్న ఈ పాట అలరిస్తోంది.

'కులాలను కలిపే జెండా, మతాల మాట ఎత్తదీ జండా'.. అంటూ కొనసాగుతూ జనసేన సిద్ధాంతాలను తెలిపేలా ఉంది. కాగా, ఇప్పటికే జనసేన తమ పార్టీకి సంబంధించి పలు పాటలు విడుదల చేసిన విషయం తెలిసిందే.                                                                                                   
Go Back to Shorts
Jana Sena
Pawan Kalyan
anantha sriram

More Telugu News